News June 27, 2024

కవిటి: కేరళలో కరాపాడు వలస కూలీ మృతి

image

కవిటి మండలం జి.కరాపాడ గ్రామానికి చెందిన నర్తు కాళీప్రసాద్ మృతి చెందారు. మృతుడు 4 రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి వలస కూలీగా వెళ్లి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న చోట పైనుంచి జారిపడి తలకు బలమైన గాయమవ్వడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. కాళీప్రసాద్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైందని, ఇంతలోనే ఇలా జరిగే సరికి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 9, 2025

SKLM: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఈనెల 13న అన్ని కోర్టుల్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, భూతగాదాలు రోడ్డు ప్రమాదాలు బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు విషయంలో వీలైనంతవరకు ఎక్కువమంది రాజీ పడే విధంగా సంబంధిత అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.

News December 9, 2025

ఎచ్చెర్ల: ప్రారంభమైన మూడో సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10 కోర్సులకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.లోకేశ్వరితో కూడిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

News December 9, 2025

శ్రీకాకుళం: ‘లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశాం’

image

శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అవినీతి నిరోధక శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులలో అధికారులు, ఉద్యోగులు ఉండగా వారిలో కొంతమంది జైలుకు వెళ్లగా మరి కొంతమంది కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు.