News August 24, 2024

కవితతో హరీశ్ రావు ములాఖత్

image

తిహార్‌ జైల్‌లో MLC కవితతో MLA హరీశ్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం ములాఖత్‌‌లో భాగంగా జైల్‌లో కవితను కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను ED అరెస్ట్‌ చేయగా, ఆ తర్వాత CBI అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఆమె జైలులో ఉన్నారు.

Similar News

News November 21, 2025

ఉమ్మడి జిల్లాను వణికిస్తోన్న చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ 9.9, ఝరాసంగం10.6, మెదక్ జిల్లా శివంంపేట11.2, పెద్దశంకరంపేట 12.0, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 11.6, కొండపాకలో 12.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.