News August 27, 2024

కవితపై అక్రమ కేసులో న్యాయమే గెలిచింది: మాజీ మంత్రి

image

ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం బాధాకరం అని, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లిక్కర్ పాలసీతో కవితకు ఎలాంటి సంబంధం లేదని, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరై విడుదల కావడం పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News September 13, 2024

పెద్దపల్లి: ఈనెల 14న Dy.CM, మంత్రుల పర్యటన షెడ్యూల్ ఇదే

image

DY.CM భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈనెల 14న ఉ.10.20 గం. నంది మేడారం హెలిప్యాడ్ చేరుకుంటారు. 10.45-11కు కటికనపల్లి సబ్ స్టేషన్ శంకుస్థాపన, 11.30-1PM స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని ధర్మారం మార్కెట్ యార్డులో ప్రసంగిస్తారు. 2.15-2.30PM కాచాపూర్, 3-3:15PM రంగాపూర్ అభివృద్ధి కార్యక్రమాల్లో, 3:30-5PM PDPL పబ్లిక్ మీటింగులో పాల్గొంటారు.

News September 13, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నేటి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.49,303 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.27,846, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,050, అన్నదానం రూ.5,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News September 12, 2024

వర్గీకరణ అమలు అధ్యయన కమిటీలో ఉమ్మడి జిల్లా మంత్రులు

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ నియామక మయ్యారు. కమిటీ సభ్యులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.