News March 23, 2024
కవితా కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది: ఎంపీలు

ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు
Similar News
News February 6, 2026
ఖమ్మం: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‘రాయ’బారమేదీ?

ఏదులాపురం పుర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గైర్హాజరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పాలేరులో పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, వందలాది గ్రానైట్ పరిశ్రమలున్న ఈ మున్సిపాలిటీలో అంటీముట్టనట్లు ఉండటం వెనుక మంత్రి పొంగులేటి శిబిరం నుంచి పిలుపు అందకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు చర్చించుకుంటున్నారు.
News February 6, 2026
ఖమ్మం SC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం SCస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన 100మందికి ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, వార్షిక ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉన్న వారు ఈ నెల22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 6, 2026
రేపటితో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగింపు

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోరుకునే వారు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. అభ్యర్థులు ఫారమ్-12తో పాటు డ్యూటీ ఆర్డర్, ఎపిక్ కార్డు నకళ్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు 8న తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.


