News November 11, 2024
కవిత్వంలో విమర్శించే ఆయుధమే ముషాయిరా: షబ్బీర్ ఆలీ
రాజకీయ నాయకులకు వారి ముందే వారిని నవ్వుతూ కవిత్వంలో విమర్శించే ఆయుధమే ముషాయిరా అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎన్నారై కాలనీలో జరిగిన ముషాయిరాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముషాయిరా ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలు వారి జీవన విధానం కళ్లకు కట్టినట్లుగా కవులు వినిపిస్తారన్నారు.
Similar News
News November 14, 2024
బాన్సువాడ: రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి:పోచారం
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ తన ఆశయమని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలన్నారు.
News November 14, 2024
NZB: ‘రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’
నిజామాబాదు జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బందులు పాటించడం లేదని తెలిపారు.
News November 14, 2024
ACBకి చిక్కిన లింగంపేట ఎస్ఐ
కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.