News June 25, 2024
కవి ప్రసాద్కు అక్కినేని శతజయంతి పురస్కారం

డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఇటీవల అక్కినేని జీవితం, నట జీవితంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ సత్తా చాటారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. అక్కినేని సాంఘిక చిత్రాలు అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతి లభించినట్లు పేర్కొన్నారు. రాబోయే సెప్టెంబర్లో పురస్కారం అందిస్తారని చెప్పారు.
Similar News
News December 15, 2025
ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.
News December 15, 2025
ప.గో: రెండేళ్లకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’

వయసుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను ఈ చిన్నారి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.
News December 15, 2025
సాఫ్ట్బాల్ బాలికల టైటిల్ విజయనగరానికే

రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో విజయనగరం జట్టు బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయి. పోటీలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి దుర్గ ఆదివారం ప్రకటించారు.


