News December 17, 2024
కవ్వాల్‌లో అరుదైన పక్షులు
జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులకు కనువిందు చేశారు. రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయి. కవ్వాల్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు.
Similar News
News February 5, 2025
ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.