News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్
కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. రాకపోకలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రి వేళల్లో రాకపోకలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్‌ను ఆదేశించారు. దీనిపై మంగళవారం HYDలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రిని కలిశారు.
Similar News
News February 5, 2025
ADB: రైలు పట్టాలపై పడి మృతి
తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్‌వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్‌తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.
News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI
నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.