News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల, నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
వేములవాడ: కోడె మొక్కు చెల్లించుకున్న 3,356 మంది

వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో కోడె మొక్కు చెల్లించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 3,356 మంది కోడె మొక్కు చెల్లించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. 48 కళ్యాణం, 48 అభిషేకం, 35 అన్నపూజ, 14 కుంకుమ పూజ టికెట్లు విక్రయించినట్లు వారు వివరించారు.
News November 23, 2025
ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

AP: ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!
News November 23, 2025
MHBD: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

నవంబర్ 24న జరిగే ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాలవల్ల రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున, జిల్లా ప్రజలు ప్రజావాణి దరఖాస్థులతో సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు హాజరు కావొద్దని సూచించారు.


