News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
20 రోజుల్లో నాలుగోసారి విశాఖకు సీఎం(2/2)

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రతిపక్షాల విమర్శలు, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ప్రముఖుల ఈ పర్యటనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, డిప్యూటీ పవన్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కూడా తరచూ విశాఖలోని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల జనసేన విస్తృత స్థాయి సమావేశం, బీజేపీ బహిరంగ సభ కూడా విశాఖలోనే జరిగింది.
News September 16, 2025
TTD టోకెన్ల జారీలో మార్పు

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.