News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 16, 2026

GNT: డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు జాక్‌పాట్

image

17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్‌పాట్”గా అభివర్ణిస్తున్నారు.

News January 16, 2026

MBNR: సొంతూళ్లకు చేరిన వలస జీవులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధి కోసం ముంబై, పుణే, సూరత్, సోలాపూర్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారు పండుగ రోజున సొంతూళ్లకు వచ్చారు. మూడు రోజుల పండగ కోసం లక్షలాది మంది తరలిరావడంతో జిల్లాలోని పల్లెలన్నీ జనసందోహంతో కళకళలాడుతున్నాయి. వలసలతో వెలవెలబోయే ఆయా గ్రామాలు వారి రాకతో పండుగ పూట సందడిగా మారాయి.

News January 16, 2026

క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

image

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్‌ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.