News February 7, 2025

కశింకోటలో కిలో బెండ రూ.100

image

బెండకాయల ధర గణనీయంగా పెరిగింది. గురువారం కశింకోట వారపు సంతలో కిలో రూ.100 చొప్పున విక్రయాలు జరిగాయి. కాగా వంకాయలు, టమాటా ధరలు మాత్రం తగ్గాయి. గతవారం కిలో రూ.20 ఉన్న టమాటా ఈ వారం రూ.15కు తగ్గింది. గతవారం 80 రూపాయలకు అమ్మిన వంకాయల ధర రూ.30కి పడిపోయింది. ఉల్లి, బంగాళదుంప ధరలు కిలో రూ.40, బీట్ రూట్, బీన్స్ రూ.50కి విక్రయించారు.

Similar News

News March 26, 2025

నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

News March 26, 2025

ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

image

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

News March 26, 2025

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష 

image

పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు రక్షణ, ప్రశాంత వాతావరణం అందించామని వారు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి శక్తి యాప్ వంటి వాటిపై ఎస్పీ నుంచి సీఎం సమాచారం తీసుకున్నారు.

error: Content is protected !!