News March 23, 2025
కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు.
Similar News
News November 13, 2025
క్షేత్ర స్థాయి పరిశీలనలో వరంగల్ మున్సిపల్ కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి వసతులను పరిశీలించారు. 34వ డివిజన్ శివనగర్‌లో ఆమె పర్యటించి తాగునీటి సమస్య, డ్రైనేజీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించారు. డివిజన్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
News November 13, 2025
ఉమ్మడి మెదక్ నుంచి టీ.టీకి ఎంపికైంది వీరే.!

ఉమ్మడి మెదక్ జిల్లా టీ.టీ అండర్ -14, 17 బాల, బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. U/17 బాలురు.. జి.గౌతమ్ కుమార్, జి.భరద్వాజ్, కే. చరణ్, U/17 బాలికలు.. పి.నవ్యశ్రీ, పి.బృహతి, ఎస్.నందిని, U/14 బాలురు.. బి.ఆయుష్, కే.ప్రతీక్, ఎస్.నర్సింగరావు, U/14 బాలికలు.. టీ.మౌనిక, ఎన్.భానుప్రియ, పి.లాస్య ఉన్నారు. వీరు ఈనెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.
News November 13, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,870

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం, బుధవారం రూ.6,830 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు రూ. 40 పెరిగి రూ.6,870 అయింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి పత్తి ధరల్లో తేడాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.


