News April 6, 2025

కశింకోట: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

image

కశింకోట మండలం నర్సింగబిల్లిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పి.బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 18, 2025

WGL: ఖుష్ మహల్ ప్రత్యేకత తెలుసా..?

image

ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూసారా.. కామెంట్ చేయండి.

News April 18, 2025

KMR: నేరస్థులపై నిఘా ఉంచాలి: SP

image

నేరస్థులపై నిఘా ఉంచాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అంకితభావంతో కృషి చేయాలని KMR జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకొని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. నైట్ పెట్రోలింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 18, 2025

NZB: రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు: కలెక్టర్

image

భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఏర్గట్ల మండలం బట్టాపూర్‌లో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇది వరకు ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.

error: Content is protected !!