News March 19, 2025
కశింకోట: హత్యకు గురైన ట్రాన్స్జెండర్ దీపుగా గుర్తింపు

హత్యకు గురైన ట్రాన్స్జెండర్ అనకాపల్లి పట్టణం గవరపాలెం బోయవీధికి చెందిన దీపు(30)గా గుర్తించారు. ఎంబీఏ చేసిన దిలిప్ కుమార్ దీపుగా మారింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహంలో సగభాగాన్ని కసింకోట మండలం బయ్యవరం వద్ద మంగళవారం గుర్తించారు. అనకాపల్లి ఇన్ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Similar News
News December 16, 2025
నల్గొండ: B.Ed సెమిస్టర్-1,3 విద్యార్థులకు అలర్ట్

MGU పరిధిలో B.Ed సెమిస్టర్ 1,3 (Reg) సంబంధించిన పరీక్ష ఫీజును జనవరి 5 వరకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్.ఉపేందర్ రెడ్డి తెలిపారు. గడువు దాటితే ఫైన్ ఉంటుందని చెప్పారు. బీఈడీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎగ్జామ్స్ టైం టేబుల్ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News December 16, 2025
విద్యార్థులకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్: కలెక్టర్

5 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన అమలాపురం కలెక్టరేట్లో మాట్లాడారు. కేంద్ర నిబంధనల మేరకు ఈ సేవలకు సంబంధించిన రుసుమును ఏడాది పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు ఈ విషయంపై శ్రద్ధ వహించి, విద్యార్థులందరితో అప్డేట్ చేయించాలని ఆదేశించారు.
News December 16, 2025
453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.


