News December 19, 2024
కష్టపడి కాకుండా ఇష్టంతో చదవండి: దశ్రు నాయక్
చింతపల్లి మండల కేంద్రంలోని డా. ఆలూకా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిఐఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ఫలితాలకై అధ్యాపకులు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలలో మెరుగైన ఫలితాలు రావాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఆయన వెంట అధ్యాపకులు ఉన్నారు.
Similar News
News January 23, 2025
నల్లగొండ: పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం
జనవరి 30 నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగనున్న LLB మూడు, ఐదు సంవత్సరాల మొదటి సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని NSUI అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో COEకి వినతిపత్రం అందజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యమైన కారణంగా పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
News January 23, 2025
NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు
సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
News January 23, 2025
కొత్త రేషన్ కార్డుల కోసం 13,921 దరఖాస్తులు: కలెక్టర్
ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లాలో 221 గ్రామ సభలు,47 మున్సిపల్ వార్డు సభలు మొత్తం 268 గ్రామ ,వార్డు సభలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు గడచిన రెండు రోజులు కలుపుకొని 444 గ్రామసభలు, 95 మున్సిపల్ వార్డుల సభలను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. బుధవారం రేషన్ కార్డుల కోసం 13,921 కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.