News November 24, 2024

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు: సవిత

image

అమరావతి: కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో తగిన స్థానం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనంగా మద్దిరాల గంగాధర్‌ని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమించడమే అని ఆమె అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల బాటపట్టారన్నారు.

Similar News

News December 11, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అంబటి రాంబాబు

image

కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. పలువురు రైతులతో ధాన్యం కొనుగోలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు లేవని, తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తుందని అంబటి విమర్శించారు.

News December 10, 2024

వైసీపీ రైతు ఉద్యమం పోస్టర్ విష్కరణ

image

ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.

News December 10, 2024

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి కంచె తొలగింపు

image

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెలో కొంత భాగాన్ని సోమవారం తొలగించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో భద్రత కోసం తాడేపల్లిలోని తన ఇంటి ప్రహరీ గోడకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేయించుకున్నారు. వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్య వైపు కంచె భాగాన్ని తొలగించినట్లు సమాచారం.