News December 31, 2024
కష్టపడి వారికే నామినేటెడ్ పదవులు: అశోక్
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే అధిష్టానం నామినేటెడ్ పదవులు ఇస్తుందని పొలిట్ బ్యూరో సభ్యులు పి.అశోక్ అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టీడీపీ కోసం కష్టపడి పని చేసిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవులకు సిఫార్సులు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సభ్యత్వ నమోదు విజయవంతంగా జరిగిందన్నారు. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2025
VZM: ‘పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు’
జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” ను శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఐదుగురు సిబ్బంది నుంచి వినతులు విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.
News January 24, 2025
VZM: జిల్లాలో 431 గోకులాల నిర్మాణం పూర్తి: కలెక్టర్
జిల్లాలో మొదటి విడతలో భాగంగా 996 గోకులాలు మంజూరు చేయగా, వీటిలో 431 నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ అంబేడక్కర్ తెలిపారు. సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత డ్వామా APOలపై ఉందని స్పష్టం చేశారు. రెండో విడత కింద ఫిబ్రవరి మొదటి వారంలో మరో 1000 గోకులాల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 2 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు.
News January 24, 2025
గజపతినగరం: మంత్రి కొండపల్లి రేపటి షెడ్యూల్ ఇదే
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం నాటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు గజపతినగరం టీడీపీ కార్యాలయంలో దత్తిరాజేరు నాయకులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2:00 గంటలకు దత్తిరాజేరు MPDO కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 3:30 గంటలకు చామలవలస గ్రామంలో పర్యటించి సాయంత్రం 5 గంటలకు విశాఖ వెళ్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.