News August 31, 2024

కష్టపడే వారికి పార్టీలో ఎప్పటికీ గుర్తింపు: సంపత్ కుమార్

image

అలంపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ గతంలో మహారాష్ట్ర రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తు ఉంటుందని దానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన సంపత్ కుమార్.

Similar News

News October 15, 2025

MBNR: యూనివర్సిటీని పరిశీలించిన ఎస్పీ

image

పాలమూరు యూనివర్సిటీలో లైబ్రరీ ఆడిటోరియంలో రేపు 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు అవుతున్నందున జిల్లా ఎస్పీ డి.జానకి యూనివర్సిటీని ఈరోజు సందర్శించి సమావేశమయ్యే భవనాన్ని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో క్యాంపస్ అంతర్గత రోడ్డు మార్గం, వెహికల్ పార్కింగ్ మొదలైన విషయాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.కె.ప్రవీణ, డా.కుమారస్వామి ఉన్నారు.

News October 14, 2025

MBNR: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం.. UPDATE!

image

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒ ఫొటోగ్రఫీ
అంశం: పోలీస్ సేవలు, త్యాగాలు/ప్రజా రక్షణ
ఫొటోలు: గరిష్ఠంగా 3
ఫొటో సైజు: 10×8 ఇంచులు
✒ షార్ట్ ఫిలిం
వ్యవధి: గరిష్ఠంగా 3Mits
థీమ్: పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత/సమాజ రక్షణ.. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మీ పూర్తి వివరాలతో పాటు ఫొటోలు, షార్ట్ ఫిలిం(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలి.

News October 14, 2025

MBNR: పోలీస్ ఫ్లాగ్ డే.. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: SP

image

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలలో పాల్గొనాలని ఎస్పీ డి.జానకి యువత, విద్యార్థులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు పిలుపునిచ్చారు. పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. ఈ నెల 23వ తేదీ లోగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో తమ రచనలు/చిత్రాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు.