News October 16, 2024
కసింకోట నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్
కసింకోట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కసింకోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతులు నక్కపల్లి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2024
మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు: చంద్రబాబు
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
News November 5, 2024
పెందుర్తి: భూములు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు
విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను విశాఖ కలెక్టర్‌కు పంపించారు. 2021లో కేటాయించిన రూ.225 కోట్ల విలువచేసే 15 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 5, 2024
ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా
చీడికాడ మండలం పెదగోగాడకి చెందిన <<14532774>>రెడ్డి సత్యనారాయణ<<>> మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇండిపెండెంట్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1984లో టీడీపీలో చేరి మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడుగా సేవలందించారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. కాలినడకన, సాధారణ బస్సుల్లోనే ప్రయాణించేవారు. స్థానిక ప్రజలు ఆయనను సత్యం మాస్టారు అంటారు.