News April 13, 2024
కాంగ్రెస్‌కు ఓటేసినా.. BRSకు వేసినా మురిగిపోయినట్లే: DK అరుణ

CM రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పాలమూరు బిడ్డగా ఆయన జిల్లాకు ఏం చేశారో చెప్పాలని DK అరుణ అన్నారు. బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జిల్లాకు సాగునీరు కోసం ఉమ్మడి రాష్ట్రంలో నేను కొట్లాడా. ఎంపీగా రేవంత్ ఏనాడూ ఈ జిల్లాపై మాట్లాడలేదు. ఆరు గ్యారంటీలు అమలు కావు.. 17సీట్లు గెలిచినా రాహుల్ ప్రధాని కారు. BRSకు ఓటేసినా.. కాంగ్రెస్‌కు వేసినా మురిగిపోయినట్లే’ అని అన్నారు.
Similar News
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST
News April 22, 2025
నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.
News April 22, 2025
మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.