News May 10, 2024
కాంగ్రెస్‌తోనే పాతబస్తీ అభివృద్ధి: CM రేవంత్ రెడ్డి

గొడవలు సృష్టించే MIMకు ఓటు వేయొద్దని, వ్యాపారాలు అభివృద్ధి చేసే INCకి ఓటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి గోషామహల్ పరిధి బేగంబజార్ ఛత్రిలో హైదరాబాద్ MP అభ్యర్థి సమీర్ ఉల్లావల్లితో కలిసి CM ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా BJP మూసీ నదిని శుద్ధి చేయాలేదన్నారు. BRS కనీసం ఉస్మానియాను కూడా బాగుచేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీ మెట్రో కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
HYD వాసులకు హెచ్చరిక.. డేంజర్లో పడుతున్నారు!

HYD వాసులకు హెచ్చరిక. సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్ బయటపడింది. APK యాప్‌ల ద్వారా అధిక వడ్డీ పేరిట వల వేస్తూ సైబర్ నేరాల నుంచి వచ్చిన డబ్బునే యాప్ యూజర్ల ఖాతాల్లోకి పంపుతున్నట్లు CCS పోలీసులు గుర్తించారు. రూ.40 వేలు పెట్టిన యూజర్లకు డబుల్ అమౌంట్ బదిలీ అయ్యింది. చివరకు అది సైబర్ క్రైమ్ మనీ అని తేలింది. ఇల్లీగల్ యాప్‌లు, APK ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే మీరు కూడా నేరంలో భాగం అవుతారు. జాగ్రత్త.
SHARE IT
News December 9, 2025
హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్

హైదరాబాద్‌లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ’మీనింగ్‌ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్‌తో మైమరిచిపోతున్నారు. ఈ ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
News December 9, 2025
రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య అధికారికంగా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీనికి సంబంధించి (MoU)పై ఇరువురు ప్రతినిధులు సంతకం చేశారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బంటియా ఫర్నిచర్స్ మరో మైలురాయిని ప్రకటించడానికి సంతోషంగా ఉందని చెప్పారు. రూ.511 కోట్ల విలువైన ఈ ముఖ్యమైన సహకారం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయనుందని వెల్లడించారు.


