News May 10, 2024

కాంగ్రెస్‌తోనే పాతబస్తీ అభివృద్ధి: CM రేవంత్ రెడ్డి

image

గొడవలు సృష్టించే MIM‌కు ఓటు వేయొద్దని, వ్యాపారాలు అభివృద్ధి చేసే INCకి ఓటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి గోషామహల్ పరిధి బేగంబజార్ ఛత్రిలో హైదరాబాద్ MP అభ్యర్థి సమీర్ ఉల్లావల్లితో కలిసి CM ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా BJP మూసీ నదిని శుద్ధి చేయాలేదన్నారు. BRS కనీసం ఉస్మానియాను కూడా బాగుచేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీ మెట్రో‌ కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.

Similar News

News February 7, 2025

HYD: దారుణం.. మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

image

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీసుల వివరాలు.. ఓ కేసు కోసం PSకు వచ్చిన మహిళ(31)తో PC సుధాకర్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చివరకు దాడి చేయించడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. CP ఆఫీస్‌‌లో విధులు నిర్వహిస్తున్న అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

News February 6, 2025

వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ సోషియాలజీ (ఇంటర్నల్), ఎంఏ సోషియాలజీ (నాన్ ఇంటర్నల్), డేటా సైన్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News February 6, 2025

HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

image

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.

error: Content is protected !!