News May 10, 2024

కాంగ్రెస్‌తోనే పాతబస్తీ అభివృద్ధి: CM రేవంత్ రెడ్డి

image

గొడవలు సృష్టించే MIM‌కు ఓటు వేయొద్దని, వ్యాపారాలు అభివృద్ధి చేసే INCకి ఓటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి గోషామహల్ పరిధి బేగంబజార్ ఛత్రిలో హైదరాబాద్ MP అభ్యర్థి సమీర్ ఉల్లావల్లితో కలిసి CM ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా BJP మూసీ నదిని శుద్ధి చేయాలేదన్నారు. BRS కనీసం ఉస్మానియాను కూడా బాగుచేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీ మెట్రో‌ కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.

Similar News

News February 18, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్‌లో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హత్యలు జరిగాయి. ఇటీవలే పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23) హత్య జరగ్గా, ఆదివారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తిని మైనర్ బాలుడు అయిన అతని అల్లుడు హత్య చేశాడు. వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

News February 18, 2025

HYD: కిడ్నీ రాకెట్ కేసు.. లుకౌట్ సర్క్యులర్ జారీ 

image

సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో సోమవారం డా.రాజశేఖర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే HYD నగరంలో దాదాపు 90 వరకు ఆపరేషన్లు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

News February 18, 2025

HYD: మనవడి చేతిలో తాత హత్య.. కత్తి స్వాధీనం 

image

HYDలోని సోమాజిగూడలో మనవడి చేతుల్లో తాత జనార్దనరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మనవడు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీ సోమవారం ముగియగా.. బీఎస్ మక్తాలోని ప్రార్థన మందిరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తి, ధరించిన దుస్తులను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా మంటల్లో కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

error: Content is protected !!