News December 4, 2024

కాంగ్రెస్‌తోనే HYD రైజింగ్.. మీ కామెంట్?

image

గతంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని BRS తమ ఖాతాలో వేసుకుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. మంగళవారం HYD రైజింగ్‌లో CM, డిప్యూటీ CM, మంత్రులు BRSపై విమర్శలు చేశారు. తాజాగా CM రేవంత్‌ HYD‌పై ట్వీట్ చేశారు. ‘ప్రజా పాలనలో HYD రైజింగ్. ఈ చారిత్రక మహానగరాన్ని విశ్వ వేదికపై వైభవంగా నిలిపే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది. నిన్న, నేడు, రేపు మా ఆలోచన, మా ఆచరణ, మా కార్యాచరణ అదే’ అని పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

image

వాట్సాప్‌ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.

News January 1, 2026

ఫ్యూచర్ సిటీ ముందున్న ‘కొత్త’ సవాళ్లు

image

కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ ముందున్న కొత్త సవాళ్లను న్యూ ఇయర్ సందర్భంగా ఓ లుక్కేద్దాం. ఈ ప్రాంతమంతా కొండలతో ఉంటుంది. ఇక్కడ డ్రోన్లూ, GPS పెద్దగా పనిచేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అకస్మాత్తుగా పరిధి మారడంతో అధికారుల మధ్య సంయవన లోపం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అన్నింటికంటే ప్రధాన సమస్య రోడ్లపై ముందుగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూరల్ ఏరియా కావడం ప్రజా రావాణాను ముందు మెరుగుపరచాలి.

News January 1, 2026

HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

image

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.