News October 21, 2024
కాంగ్రెస్‌ను తిట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది: మంత్రి జూపల్లి
బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఇవాళ తాము ఏం పని చేయాల్సి వచ్చేదికాదని ఆయన తెలిపారు.
Similar News
News November 12, 2024
MBNR: ఈనెల 15న ఉమ్మడి జిల్లా బాక్సింగ్ ఎంపికలు
MBNR జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 8-14, అండర్-17 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే వారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉ.10 గంటలకు హాజరు కావాలని కోరారు.
News November 11, 2024
కల్వకుర్తి: తాండ్రలో నేడు సదర్ సమ్మేళనం
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.
News November 11, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనాధగా మారిన ఇంటర్ విద్య
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో జిల్లా ఇంటర్ అధికారి (DIEO) పోస్టులు మంజూరు చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఎక్కడా జిల్లా ఇంటర్ అధికారి పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లతో నెట్టుకు వస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి ఇంటర్ విద్య గాడి తప్పుతోందని విమర్శలు ఉన్నాయి.