News April 11, 2025

కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలి: ADB Ex MP

image

సోనల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాజీ ఎంపీ సోయం బాపూరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీని నాయకులు శాలువాతో సత్కరించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ని బోథ్, సోనల మండల్లాలో పటిష్ఠం చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోతన్న తదితరులున్నారు.

Similar News

News November 21, 2025

NPCILలో 122 పోస్టులు.. అప్లై చేశారా?

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) 122 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://npcilcareers.co.in

News November 21, 2025

పెద్దపల్లి: ఐపీఎస్ అధికారి బి.రామ్ రెడ్డి బదిలీ

image

సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020) బదిలీ అయ్యారు. ఆయన్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఉన్న శ్రీ పి. కరుణాకర్, ఎస్పీ (ఎన్సీ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News November 21, 2025

సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: MNCL కలెక్టర్

image

వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్‌‌లో జరిగిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధుల దరఖాస్తులను పోలీసు, రెవెన్యూ సిబ్బంది సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు.