News February 2, 2025

కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.

Similar News

News September 19, 2025

జగిత్యాల: పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమంపై శిక్షణ

image

జగిత్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల సీడీపీఓ మమత గురువారం పట్టణ అంగన్‌వాడీ టీచర్లకు ‘పోషణ్‌ బి పడ్డా బాయ్‌’ కార్యక్రమంపై అవగాహన శిక్షణ ఇచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో భాగంగా తొలిరోజు ప్రీ-స్కూల్ మెటీరియల్ తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కవితారాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులు ర్యాంకులు సాధించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా జేఈఈ, నీట్‌లలో ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత చదివే కోర్సుల ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News September 19, 2025

SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

image

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?