News February 2, 2025
కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News February 9, 2025
బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 9, 2025
కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.
News February 9, 2025
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు

*షాహిద్ అఫ్రిదీ- 351 సిక్సర్లు (369 ఇన్నింగ్సులు)
*రోహిత్ శర్మ- 334 (259)
*క్రిస్ గేల్- 331 (294)
*జయసూర్య- 270 (433)
*ధోనీ- 229 (297)
*మోర్గాన్- 220 (230)
*డివిలియర్స్- 204 (218)
*మెక్‌కల్లమ్- 200 (228)
*సచిన్- 195 (452)