News February 2, 2025
కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News February 2, 2025
ఆసిఫాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి కృషి: రామకృష్ణ
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆదివారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ఆధ్వర్యంలో అడ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్‌ను జె.డి.ఎం. నాగభూషణం, ఆసిఫాబాద్ వెలుగు మహిళా మండల సమాఖ్య ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
News February 2, 2025
NRPT: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
అధునాతన టెక్నాలజీని వాడుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్‌పై స్పందించొద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
News February 2, 2025
కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం!
కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని వారు వివరించారు. అయితే ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ఔషధాన్ని తీసుకొస్తామని వారు చెప్పారు.