News April 6, 2024
కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్

మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ సత్యనారాయణగౌడ్కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులున్నారు.
Similar News
News December 2, 2025
సైబర్ నేరాలకు ‘ఫుల్స్టాప్’.. అవగాహనతోనే పరిష్కారం

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైమ్ ఠాణాలో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్ – సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ముందుకు వచ్చి సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.
News December 2, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతి లలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.