News May 3, 2024
కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు: రఘునందన్ రావు

అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రైతు రుణమాఫీ, అవ్వ, తాతలకు రూ.4వేల పించన్, మహిళలకు రూ.2500/- ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మోసం చేసే పార్టీలేనని, బీజేపీని గెలిపించాలని కోరారు.
Similar News
News December 11, 2025
మెదక్: సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కలెక్టరెట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా వివిధ మండలాల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లాదుర్గ్-10, హవేలి ఘన్పూర్-10 పాపన్నపేట-14, రేగోడు-12, పెద్ద శంకరంపేట-14, టేక్మాల్-14 క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి, వాటిని కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నేరుగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
News December 11, 2025
తొగిట: పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

హవేలీ ఘనపూర్ మండలం ఎన్నికల కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ మండల తహశీల్దార్ సింధూ రేణుకతో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందన్నారు. ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News December 11, 2025
మెదక్ జిల్లాలో 20.52% ఓటింగ్

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9 గంటల వరకు 20.52 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వణికించే చలి ఉన్నప్పటికీ ప్రజలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు బారులు తీరి ఉన్నట్లు వివరించారు.


