News March 29, 2024
కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?
కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?
Similar News
News January 16, 2025
సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కమిటీ!
కాలేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలపై ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, దేవాదాయ శాఖ ఆర్జెసి, యాదగిరిగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్, ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈలు ఉండనున్నారు. పుష్కరాలకు రూ.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, పనులను ప్రారంభించారు.
News January 16, 2025
రామగుండం: పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: CP
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన 13 మంది అధికారులను పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. CPమాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. పోలీస్ అధికారులు రాజు, రాఘవేంద్రరావు ఉన్నారు.
News January 16, 2025
హుస్నాబాద్: కబడ్డీ ‘కోర్టు’ వేసి.. దానిపై ‘చితి’ని పేర్చి..
అక్కన్నపేట మండల చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ (43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పులికాశి సంపత్ కబడ్డీ క్రీడాకారుడు కావడంతో తోటి క్రీడాకారులు, చౌటపల్లి గ్రామస్థులు కలిసి సంపత్‌కు చెందిన వ్యవసాయ బావి వద్ద భూమిని చదును చేసి కబడ్డీ ‘కోర్టు’ వేసి దానిపై ‘చితి’ ని పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.