News February 1, 2025

‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి

image

ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News February 1, 2025

WGL: ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2304 మంది ఓటర్లు ఉన్నారని, 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, వీఎస్టీ మొదలగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 1, 2025

APకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తేలింది’ అని పవన్ అన్నారు.

News February 1, 2025

నరసరావుపేట: యువతిని బెదిరించి రూ. 11 లక్షలు స్వాహా

image

నరసరావుపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సాయిసత్య శ్రీ అనే యువతిని ఆన్లైన్‌లో బెదిరించి రూ. 11 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. టూ టౌన్ సీఐ హైమారావు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్‌లో తనకు గంజాయి వచ్చిందని, తనను అరెస్టు చేయటానికి స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు. 2వ రోజే తన అకౌంట్‌లో రూ. 11లక్షలు కనిపించలేదన్నారు.