News January 12, 2025
కాంగ్రెస్ డీఎన్ఏలో ద్వేషం, విధ్వంసం: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని మరోసారి రుజువైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని అన్నారు.
Similar News
News January 12, 2025
HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!
HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
News January 12, 2025
HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!
బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు.
News January 12, 2025
OU: PHD ప్రవేశాలకు నోటిఫికేషన్
ఓయూ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలకు సంబంధించిన కేటగిరీ 2 కింద పీహెచ్డీ ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23వరకు తమ పేర్లను నమోదు చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.