News January 21, 2025
కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి పొన్నం
నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.
Similar News
News January 21, 2025
ఈనెల 24న కరీంనగర్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ పట్టణంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్‌ను పరిశీలించారు.
News January 21, 2025
AI టెక్నాలజీని వేగవంతం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
సాంబానోవా సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చినందుకు ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. AI మౌలిక సదుపాయాల సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో అత్యాధునిక AI టెక్నాలజీని వేగవంతం చేస్తామన్నారు.
News January 21, 2025
ఇచ్చిన మాట ప్రకారం నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం
సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.