News January 21, 2025
కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి పొన్నం

నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.
Similar News
News February 19, 2025
వీణవంక: చలిమంట కాగుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు చనిపోయిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఈనెల 12న ఉదయం చలిమంట కాగుతుండగా చీర కొంగుకి ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. పొట్టపై భాగాన కింది భాగాన పూర్తిగా కాలిపోవడంతో KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరమ్మ చనిపోయిందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
News February 19, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమం

శంకరపట్నం మండలం కొత్తగట్టు జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. స్థానికుల తెలిపిన వివరాలిలా.. హుజురాబాద్ నుంచి కొత్తగట్టు వెళ్తున్న బైకర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్ కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2025
జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.