News May 11, 2024

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారు: అర్వింద్

image

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని, కనుక ప్రజల్లో మార్పు రావాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వ హించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని, ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 20, 2025

రుద్రూర్: పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించాలి: కలెక్టర్

image

పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం ఆయన రుద్రూర్‌లో సందర్శించారు. రుద్రూర్ బస్టాండ్ వెనుక వైపు ఉన్న భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News January 20, 2025

NZB: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో దూకి శివరాం(62) మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి(M) జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2 ఏళ్ల కింద మరణించారు. మనస్తాపంతో శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసర గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.

News January 20, 2025

తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత: TPCC ఛీఫ్

image

తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నూతన క్రీడా విధానంపై మెల్బోర్న్ అధికారులతో చర్చించామన్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.