News July 20, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదు: మంత్రి జూపల్లి

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారంలేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. విపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కిందిస్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.
Similar News
News October 28, 2025
కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News October 28, 2025
MBNR: అక్కడే అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 5.8, బాలానగర్ 5.5, రాజాపూర్ 4.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 3.5, నవాబుపేట 3.0, మహబూబ్ నగర్ గ్రామీణం, మహమ్మదాబాద్ 2.5, కోయిలకొండ మండలం పారుపల్లి 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News October 28, 2025
MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నిందితులు వీరే

MBNR(D) మాచారం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధిలో గంజాయి విక్రయంపై పోలీసులు దాడి నిర్వహించారు. నిందితులు 1.మరికంటి సుమంత్ రెడ్డి(MBNR),2.అబ్దుల్ రెహమాన్(MBNR),3.శుభోద్ కాంత్ శర్మ(బీహార్),4.సత్తు యాదవ్ కుమార్(బిహార్) గంజాయి కొనుగోలు,విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ కావడం వల్ల దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో RNCC యూనిట్, ఈగల్ టీం,SI ఖాదర్, పోలీస్ సిబ్బందిని SP ప్రశంసించారు.


