News January 17, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది: ఎంపీ కావ్య

image

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

వరంగల్: మిర్చి రైతన్నలకు సైతం నిరాశ.. తగ్గిన ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి.

> క్వింటా తేజ మిర్చి ధర గురువారం రూ.14,000 పలకగా.. నేడు రూ.13,600కి చేరింది.
> 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా.. ఈరోజు రూ.13,600 అయింది.
> వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ.16వేల ధర రాగా.. ఈరోజు భారీగా రూ. 500 తగ్గి రూ.15,500కి పడిపోయింది.

News February 14, 2025

వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News February 14, 2025

Valentine’s Day SPECIAL.. మన కొండా లవ్ స్టోరీ తెలుసా..?

image

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ది బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే కొండా మురళి, సురేఖ దంపతులని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. 1980లో వరంగల్ LB కళాశాలలో చిగురించిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. 1987లోనే సురేఖను తిరుపతి తీసుకెళ్లి మురళి పెళ్లి చేసుకున్నారట. వీరి ప్రేమపై ‘కొండా’ మూవీ సైతం వచ్చిన విషయం తెలిసిందే. మీకు తెలిసిన ఓ లవ్ స్టోరీని కామెంట్ చేయండి.

error: Content is protected !!