News January 22, 2025

కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే: కవిత

image

బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ MLC కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం BRS పార్టీదని, BRS కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా BRS కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.

Similar News

News January 22, 2025

NZB: ముసాయిదా జాబితా మాత్రమే: కలెక్టర్

image

గ్రామసభల్లో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలో పలు మండలాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అనర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

News January 22, 2025

NZB: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరికి కోర్టు జైలు విధించినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలో గాంధీ చౌక్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా శంకర్, రాజేశ్ అనే వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారన్నారు. వీరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు SHO తెలిపారు.

News January 22, 2025

NZB: జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు

image

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు రావడం బుధవారం నిజామాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. 43వ డివిజన్‌లో పాత అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన వార్డుసభ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి జాబితా పరిశీలించారు. ఇందులో నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ భార్య చామకూర విశాలిని రెడ్డి పేరు (సీరియల్ నంబర్ 106) (ఇటుకల గోడ) రావడంతో అంతా అవాక్కయ్యారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.