News January 22, 2025
కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే: కవిత

బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ MLC కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం BRS పార్టీదని, BRS కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా BRS కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.
Similar News
News February 11, 2025
NZB: జిల్లా ఓటర్లు ఎంతమందంటే?

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఓటర్ల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3,751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 2001, ఆర్మూర్ డివిజన్‌లో 1049, బోధన్ డివిజన్లో 701 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
News February 11, 2025
భీమ్‌గల్: Way2News కథనానికి స్పందన

Way2Newsలో సోమవారం ప్రచురితమైన ‘నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు’ కథనానికి మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్ అలీ భీమ్‌గల్ మండలం సాలింపూర్ గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాడైపోయిన పైపులు, మోటార్లను మరమ్మతు చేయించి గ్రామస్థులకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 11, 2025
నిజామాబాద్: నిర్యుదోగ మహిళలకు ఉచిత శిక్షణ

SC కార్పొరేషన్ ద్వారా SC నిర్యుదోగ మహిళలకు న్యాక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ జె.లింబద్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ టవర్స్ పక్కన ఉన్న శిక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 12లోపు సంప్రదించలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు కుట్టు మిషన్ ఉచ్చితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.