News May 20, 2024
కాంగ్రెస్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది: జగదీష్
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కరువును తీసుకువచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు.
Similar News
News December 5, 2024
ఎస్సై ఆత్మహత్య.. ఇన్‌స్టా అమ్మాయే కారణం!
ములుగు(D) వాజేడు SI హరీశ్‌కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్‌కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.
News December 5, 2024
చిట్యాల: మహిళను కొట్టి పుస్తెలతాడు అపహరణ
ఇంట్లోకి ఇద్దరు చొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు. అనంతరం వారు వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పారిపోయారు.
News December 5, 2024
కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్
గ్రామస్థాయి స్థానిక సంస్థలలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి, నియమ నిబంధనల ప్రకారం 2025- 26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె జడ్పీ సమావేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.