News July 11, 2024
కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే దేశానికే నష్టం: KTR

TG: కాంగ్రెస్ పాలనలో HYDలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని పలు పత్రికా కథనాలను ఉటంకిస్తూ KTR ట్వీట్ చేశారు. నగరంలో వరుస హత్యలు పెరిగిపోతున్నాయని, అంతర్రాష్ట్ర ముఠాలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులు తరలిపోవడంతో ఉపాధి దెబ్బతింటోందని, నగర ప్రగతికి బ్రేకులు వేస్తే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సర్కారు మేల్కొనకపోతే HYD ప్రతిష్ఠ దెబ్బతింటుందని, అది రాష్ట్రానికే కాదు దేశానికీ నష్టమన్నారు.
Similar News
News November 27, 2025
వరంగల్: ఎనిమిది కాళ్ల గొర్రె పిల్ల జననం..!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 8 కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. తండాకు చెందిన ఇస్లావత్ ధూప్ సింగ్కు చెందిన గొర్రె రెండో ఈతలో గొర్రె పిల్లకు జన్మనివ్వగా 8 కాళ్లతో జన్మించింది. పుట్టిన అరగంట తర్వాత గొర్రె పిల్ల మృతిచెందింది. దీంతో ఎనిమిది కాళ్లతో పుట్టిన గొర్రె పిల్లను చూడడానికి తండావాసులు తరలివచ్చారు. జన్యు మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుందని పశువైద్యాధికారులు తెలిపారు.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.


