News March 20, 2024

కాంగ్రెస్ MP అభ్యర్థి రేసులో మద్దూరు సుబ్బారెడ్డి మనవడు..?

image

నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు మద్దూరు హరి సర్వోత్తమరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల అయన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, మంత్రిగా,
ఎమ్మెల్సీగా, నంద్యాల కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన మద్దూరు సుబ్బారెడ్డి సేవలు ఆయన మనవడికి కలిసొస్తుందని భావిస్తున్నారు.

Similar News

News April 4, 2025

దేవ‌సేన శోభా బ‌ర్త్ డే.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్ పోస్ట్!

image

మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తమ ముద్దుల కుమార్తె దేవసేన శోభా MM తొలి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంచు మనోజ్ నెట్టింట షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అంతకు ముందు మేము ముగ్గురం. ఏడాది క్రితం నలుగురం అయ్యాం. దేవసేన శోభ జననం మా జీవితాల్లో వెలుగుతోపాటు ధైర్యాన్ని, అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని రాసుకొచ్చారు.

News April 4, 2025

కర్నూలు: ‘విమానాశ్రయానికి వసతులు కల్పించాలి’

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 4, 2025

కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

image

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!