News March 27, 2025
కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనకాడబోం: సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనుకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టును 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.
Similar News
News April 18, 2025
గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

ఆన్‌లైన్ బెట్టింగ్ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <
News April 18, 2025
ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.