News December 23, 2024
కాంట్రాక్టు సంస్థలపై ఏపీ సీఆర్డీఏ కీలక ప్రకటన

అమరావతి నిర్మాణంలో రూ.100కోట్లకు పైబడి పనులను ప్యాకేజీల వారీగా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. ఈ పనులలో కాంట్రాక్టు సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు సులభతర విధానాన్ని రూపొందించామని కమిషనర్ కె.భాస్కర్ తాజాగా విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్కై https://crda.ap.gov.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News November 14, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.
News November 13, 2025
కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.
News November 13, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.


