News February 21, 2025
కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.
Similar News
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


