News February 21, 2025

కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.

Similar News

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.

News July 7, 2025

250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

ఇబ్రహీంపట్నంలోని మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్ వ‌ద్ద 250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ స‌ఫారీ, బ‌యోడైవ‌ర్సిటీ పార్క్, నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ ఏర్పాటు ద్వారా మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.

News July 7, 2025

రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

image

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.