News April 7, 2025
కాకాణికి ఊరట లభించేనా..?

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా నేడు మరోమారు హైకోర్టులో కాకాణి బెయిల్పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు కాకాణి ఎక్కడున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Similar News
News April 17, 2025
నెల్లూరులో నేడే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం 11 గంటలకు నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన జరగనున్నట్లు జల వనరుల శాఖ ఇంజినీర్ డాక్టర్ దేశి నాయక్ తెలిపారు. బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాని కోరారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
News April 17, 2025
నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు టు టౌన్ పరిధిలో సుల్తాన్(40) దారుణ హత్యకు గురయ్యారు. జాకీర్ హుస్సేన్ నగర్, పెన్నా శివారు ప్రాంతంలో బుధవారం రాత్రి దుండగులు ఆయన తల పగలగొట్టి హత్యచేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట సీఐ అన్వర్ బాషా సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.